ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బీసీల హక్కుల కోసం సుప్రీంకోర్టు బాట

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి… బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి కట్టుబడి ఉందని స్పష్టీకరణ… గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శ…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 3:12 PMకి 2,587 వీక్షణలు
బీసీల హక్కుల కోసం సుప్రీంకోర్టు బాట — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 1: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై స్పందించిన ఆయన, తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ ప్రభుత్వం న్యాయపోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. గతంలో అమల్లో ఉన్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. శాసనసభలో 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టకముందే వైసీపీ నేతలు న్యాయస్థానాల్లో కేసులు వేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

50 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086