నేటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన
బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు… విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కేంద్రం… మండలాల వారీగా షెడ్యూల్ విడుదల చేసిన పోలీసు కమిషనరేట్…

విజయవాడ, అక్టోబర్ 9: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం అందించే ప్రక్రియలో భాగంగా శుక్రవారం నుంచి బాండ్ల పరిశీలన, పత్రాల నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రుల బృందం నిర్ణయం మేరకు సీఐడీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. డిపాజిటర్లు, నామినీలు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు తమ వద్ద ఉన్న ఒరిజినల్ బాండ్లతో పాటు ఆధార్, పాన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబరు వివరాలను తీసుకురావాలని సూచించారు. డిపాజిటర్ మండలాల వారీగా షెడ్యూల్ అక్టోబర్ 9, 10: రెడ్డిగూడెం మండలం అక్టోబర్ 12, 13: ఏ కొండూరు మండలం అక్టోబర్ 14, 15: గంపలగూడెం మండలం అక్టోబర్ 16, 17: జీ కొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని 20 మండలాలకు చెందిన బాండ్ల పరిశీలన పూర్తయ్యే వరకు కార్యక్రమం కొనసాగుతుందని, మిగిలిన మండలాల షెడ్యూల్‌ను తదుపరి ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. నిర్ణయించిన తేదీల్లో సంబంధిత మండలాల వారు మాత్రమే కేంద్రానికి రావాలని కోరారు. బాధితులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా, ఆందోళన చెందకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేసింది.మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ లేదా చట్టబద్ధ వారసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. డిపాజిటర్ స్వయంగా రాలేని పరిస్థితుల్లో అధికారిక అనుమతి లేఖతో కుటుంబ సభ్యులు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఒరిజినల్ బాండ్లను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని, కేవలం పరిశీలనకు చూపిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. బాండ్ల రంగు జిరాక్స్ ప్రతులపై స్వీయ ధ్రువీకరణ సంతకం చేసి సమర్పించాలన్నారు. పత్రాలు స్వీకరించిన అనంతరం రసీదు అందజేస్తారని తెలిపారు.

