ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మహిళలకు స్వయం ఉపాధి.. పేదలకు ఆర్థిక భరోసా!

ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ… ముగ్గురు లబ్ధిదారులకు రూ.1.91 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు… ప్రజల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే బొండా ఉమా…

V10TV న్యూస్ డెస్క్ 14 అక్టోబర్, 2026 11:00 AMకి 4,862 వీక్షణలు
మహిళలకు స్వయం ఉపాధి.. పేదలకు ఆర్థిక భరోసా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 14: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం విజయవాడ 60వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గజ్జలకొండ గజలక్ష్మి, బచ్చు జయలక్ష్మి, కె.వరలక్ష్మికి కుట్టు మిషన్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని సూచించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా షేక్ ఇస్మాయిల్‌కు రూ.45,160, నెప్పాలి వెంకట సాయి గణేష్‌కు రూ.92,415, దొంగ సరస్వతికి రూ.53,739 చొప్పున మొత్తం రూ.1,91,314 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని బొండా ఉమా పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086