ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సిమెంట్‌ పరిశ్రమల్లో పచ్చదనం తప్పనిసరి

పరిశ్రమల ప్రాంగణాల్లో 33 శాతం పచ్చదనం పెంచాలి… దుమ్ము, ధూళితో ప్రజలు, పంటలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు… ప్రత్యామ్నాయ ఇంధనంగా చెత్త నుంచి తయారయ్యే ఇంధనం వినియోగించాలి…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 7:25 PMకి 4,769 వీక్షణలు
సిమెంట్‌ పరిశ్రమల్లో పచ్చదనం తప్పనిసరి — చిత్రం 1
సిమెంట్‌ పరిశ్రమల్లో పచ్చదనం తప్పనిసరి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

కర్నూలు, అక్టోబరు 6: సిమెంట్‌ పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య పరిశ్రమల యాజమాన్యాలను ఆదేశించారు. వాయు, నీటి, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలులోని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో కలిసి రాయలసీమ సిమెంట్‌ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పరిశ్రమల పరిసరాల్లోని ప్రజలు, పంట పొలాలపై కాలుష్య ప్రభావానికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. దుమ్ము, ధూళిని నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్న రోడ్ల అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావాలని సూచించారు.

సిమెంట్‌ పరిశ్రమల్లో పచ్చదనం తప్పనిసరి — అదనపు చిత్రం 2

వర్షపు నీటి సంరక్షణ, సామాజిక బాధ్యత నిధులతో స్థానిక అభివృద్ధి పనులు, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ నిర్మూలనపై దృష్టి పెట్టాలన్నారు. పట్టాభిరామ్‌ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పరిశ్రమలు కచ్చితంగా పాటించాలని కోరారు. సిమెంట్‌ పరిశ్రమలు తమ ఇంధన అవసరాల్లో కనీసం ఆరు శాతం మేర చెత్త నుంచి తయారయ్యే ఇంధనాన్ని వినియోగించాలని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న 107 తాజా వ్యర్థాల ప్రాసెసింగ్‌ కేంద్రాలు, ప్రస్తుతం ఉన్న పాత వ్యర్థాల శుద్ధి కేంద్రాల్లో ఉత్పత్తయ్యే ఈ ఇంధనాన్ని పరిశ్రమలకు అనుసంధానిస్తామన్నారు. వినియోగ వివరాలతో ఏటా నివేదికలు సమర్పించాలని సూచించారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ రమేష్‌, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, పర్యావరణ ఇంజినీర్‌ కిషోర్‌రెడ్డి, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086