ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌–2.0

అక్టోబరు 11 నుంచి పది రోజులపాటు అంగరంగ వైభవంగా వేడుకలు… మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు… ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బొండా ఉమ వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 2:38 PMకి 4,799 వీక్షణలు
మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌–2.0 — చిత్రం 1
మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌–2.0 — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 4: మైసూరు దసరా తరహాలో విజయవాడ నగరంలో పది రోజులపాటు విజయవాడ ఉత్సవ్‌–2.0ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్‌–2.0 పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ అక్టోబరు 11 నుంచి ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు విజయవాడకు వస్తారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయ పవిత్రతను కాపాడుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ఏడాది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంతోపాటు పున్నమి

మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌–2.0 — అదనపు చిత్రం 2

ఘాట్‌, నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో భారీ ప్రదర్శనశాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, సంగీత విభావరులు, చిన్నారులు–పెద్దలను ఆకట్టుకునే వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని కార్యక్రమాలకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి దసరా సెలవులను ఆనందంగా గడిపేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. విజయవాడ ఉత్సవ్‌–2.0కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, సంగీత రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు బొండా ఉమ తెలిపారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులు, నగర ప్రజలు ఉత్సవాల విజయవంతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి ఛైర్మన్‌ గొట్టుముక్కల రఘురామరాజు, మాజీ కార్పొరేటర్‌ పిరియా జగదాంబ, దాసరి ఉదయశ్రీ, చరణ్‌సాయి యాదవ్‌, వేల్పుల రాజేష్‌, బెజ్జం జైపాల్‌, షేక్‌ గౌస్‌బాషా, రాజాన బంగారునాయుడు, బుదాల సురేష్‌, జాన్‌వలి, ఫర్వీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086