నందిగామలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
13, 14, 15, 16వ వార్డుల్లో పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన... రూ.19 కోట్ల హ్యామ్ నిధులతో రహదారుల అభివృద్ధి... నాణ్యతతో పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం...

నందిగామ: నందిగామ పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. పట్టణంలో రూ.19 కోట్ల హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) నిధులతో చేపడుతున్న రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా 13, 14, 15, 16వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు పట్టణంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

