ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గద్దె దంపతుల చేతుల మీదుగా కల్పవృక్షారోపణ

మొక్కను నాటిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ దంపతులు పచ్చదనంతోనే ఆరోగ్యకరమైన వాతావరణమని వెల్లడి కల్పవృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు

V10TV న్యూస్ డెస్క్ 27 సెప్టెంబర్, 2026 3:44 PMకి 3,584 వీక్షణలు
గద్దె దంపతుల చేతుల మీదుగా కల్పవృక్షారోపణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 27: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పిలుపునిచ్చారు. పిన్నమనేని పాలిటెక్నిక్‌ రోడ్డులోని జీవీ రాధామాధవ్‌ అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో ఆదివారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ కల్పవృక్షాన్ని నాటారు. గద్దె రాజేష్‌తో కలిసి మొక్క వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చారిత్రక, పురాణ ప్రాధాన్యం కలిగిన కల్పవృక్షాన్ని నాటే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ మొక్కకు ఔషధ గుణాలు ఉన్నాయని ప్రజల్లో విశ్వాసం ఉందని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌ వాసులు మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని కోరారు. గద్దె అనురాధ మాట్లాడుతూ నివాస సముదాయాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రతి అపార్ట్‌మెంట్‌లో మొక్కల పెంపకానికి ప్రత్యేక స్థలం కేటాయించాలని సూచించారు. పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌ మాట్లాడుతూ కల్పవృక్షం విశిష్టతను తెలుసుకొని విదేశాల నుంచి మొక్కలను తెప్పిస్తున్నట్లు తెలిపారు. తమ అపార్ట్‌మెంట్‌లో కల్పవృక్షాన్ని నాటడం సంతోషంగా ఉందని నివాసి చంద్రశేఖర్‌ చెప్పారు. కార్యక్రమంలో కీర్తిరావు, అనూప్‌, ప్రతాప్‌, గద్దె బుచ్చి తిరుపతయ్య, రమేష్‌బాబు, సాంబశివరావు, ప్రమోద్‌, నరేంద్ర జైన్‌, కమలేష్‌ జైన్‌, సంజయ్‌ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086