ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

అభివృద్ధి.. సంక్షేమానికి నందిగామలో ఊతం

59 కుటుంబాలకు రూ.29.63 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు… వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సౌమ్య… తక్కెళ్లపాడు, లచ్చపాలెంలో రూ.40 లక్షల సీసీ రోడ్లకు శ్రీకారం…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 7:22 PMకి 3,860 వీక్షణలు
అభివృద్ధి.. సంక్షేమానికి నందిగామలో ఊతం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

నందిగామ, అక్టోబర్‌ 2: గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో ఆమె పాల్గొన్నారు. కాకానినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి సౌమ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించడమే గాంధీజీకి అందించే నిజమైన నివాళని పేర్కొన్నారు. చందర్లపాడు మండలానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.29,63,012 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తోందన్నారు. నందిగామ డీవీఆర్‌ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి పనులను సౌమ్య పరిశీలించారు. స్లాబ్‌ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే నందిగామతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని తెలిపారు. పల్లె పండుగ–3.0లో భాగంగా తక్కెళ్లపాడు, లచ్చపాలెం గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, పనులను నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. తక్కెళ్లపాడులో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ‘సేవా మేరా యోగ్‌దాన్‌’ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సౌమ్య పిలుపునిచ్చారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086