చిన్నారులతో సత్యనారాయణపురం సీఐ స్వాతంత్ర్య వేడుకలు
చిన్నారులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఐ లక్ష్మీనారాయణ... చాక్లెట్లు, కేకులు పంచి చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్న పోలీసులు... దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచన...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 – V10TV AP:సత్యనారాయణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఐతో పాటు పోలీసు సిబ్బంది చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు, కేకులు పంచి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. దేశ స్వాతంత్ర్య

ప్రాముఖ్యతను చిన్నారులకు వివరించిన సీఐ లక్ష్మీనారాయణ.. దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది చిన్నారులతో ఆప్యాయంగా మెలుగుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సత్యనారాయణపురం సర్కిల్ పోలీసు సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు.

