ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

శరన్నవరాత్రి వేడుకల్లో బొండా ఉమా ప్రత్యేక పూజలు

విజయవాడ ఉత్సవ్‌–2.0తో నగరానికి మరింత శోభ... మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రతిరోజూ సాంస్కృతిక సందడి... ఉత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని బొండా ఉమా పిలుపు...

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 1:32 PMకి 4,968 వీక్షణలు
శరన్నవరాత్రి వేడుకల్లో బొండా ఉమా ప్రత్యేక పూజలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదివారం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సెంట్రల్‌ నియోజకవర్గంలోని 63వ డివిజన్‌ రాజీవ్‌నగర్‌, 60వ డివిజన్‌ వాంబే కాలనీల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ గతేడాది విజయవాడ ఉత్సవాలను వైభవంగా నిర్వహించి నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చామన్నారు. అదే స్ఫూర్తితో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ్‌–2.0ను మరింత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రతిరోజూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు, సినీ తారల సందడి, వివిధ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడిపేలా ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు విజయవాడ ఉత్సవాల్లోనూ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించాలని కోరారు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఉత్సవాలకు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ భాగస్వాములై విజయవాడ ఉత్సవ్‌–2.0ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086