దుర్గమ్మ భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు!
అధికార యంత్రాంగం సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు… క్యూలైన్లలో తాగునీటికి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు… క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ…

విజయవాడ, అక్టోబర్ 12: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేవాదాయ శాఖ, ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా లోటుపాట్లు గుర్తిస్తే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులందరికీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోంది.

