ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా:ఎమ్మెల్యే బొండా ఉమా

కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి… జనాభాకు అనుగుణంగా పోస్టులు పెంచి ఖాళీలు భర్తీ చేయాలని విజ్ఞప్తి… పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొండా ఉమా హామీ…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 5:04 PMకి 3,594 వీక్షణలు
ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా:ఎమ్మెల్యే బొండా ఉమా — చిత్రం 1
ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా:ఎమ్మెల్యే బొండా ఉమా — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. మంగళవారం సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆశా వర్కర్లు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రతతోపాటు అన్ని రకాల సెలవులు, ప్రయాణ–దినసరి భత్యాలు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా పోస్టుల సంఖ్యను పెంచి, ప్రస్తుతం ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ

ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా:ఎమ్మెల్యే బొండా ఉమా — అదనపు చిత్రం 2

చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించేందుకు నిరంతరం పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని అభ్యర్థించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన బొండా ఉమా మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ పేద కుటుంబాలకు ఆరోగ్య సేవలను చేరవేయడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతోపాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086