ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

తార మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే బొండా ఉమా హర్షం

సింగ్‌నగర్‌, బైపాస్‌ రోడ్డు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం… ఒకే చోట వివిధ వైద్య నిపుణుల సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయం… పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలి…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 2:23 PMకి 4,846 వీక్షణలు
తార మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే బొండా ఉమా హర్షం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వైద్య సేవల విస్తరణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం 58వ డివిజన్‌ పాముల కాలవ రోడ్డు, విక్రమ్‌ పబ్లిషర్స్‌ ఎదురుగా బైపాస్‌ రోడ్డులో డాక్టర్‌ మహేష్‌ ఆధ్వర్యంలోని తార ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసిన సందర్భంగా ఆయన వైద్య దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న సెంట్రల్‌ నియోజకవర్గంలో వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. సింగ్‌నగర్‌, బైపాస్‌ రోడ్డు పరిసర ప్రాంతాల ప్రజలకు స్థానికంగానే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు.ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణుడిగా సేవలందిస్తున్న డాక్టర్‌ మహేష్‌ ఆసుపత్రిని వివిధ వైద్య విభాగాలతో అభివృద్ధి చేయడం అభినందనీయమని చెప్పారు. ఒకే చోట పలు విభాగాల వైద్య నిపుణుల సేవలు అందుబాటులో ఉంటే అత్యవసర చికిత్సల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన చికిత్స అందించాలని సూచించారు. డాక్టర్‌ మహేష్‌, ఆయన సతీమణి ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు విస్తృత వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ వైద్య రంగ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086