ఓటర్ల హక్కులను కాపాడాలంటూ కాంగ్రెస్ నిరసన
జగన్మోహన్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్... ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ నినాదాలు... ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులపై ఆగ్రహం...

విజయవాడ, అక్టోబర్ 12: ఓటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ధర్నా చౌక్‌లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మార్చ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అరెస్టులను ఖండిస్తూ నిరసన తెలిపారు. జగన్మోహన్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ను రద్దు చేసి ఓటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, దాని పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు పేర్కొన్నారు.

