ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గుడ్లవల్లేరులో రోడ్లకు రూ.74 లక్షల బూస్ట్

విన్నకోటలో రెండు కీలక రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శ్రీకారం... సుబ్బి చెరువు రోడ్డుకు రూ.9 లక్షలు.. కట్టమని చెరువు–చింతలకుంట రోడ్డుకు రూ.65 లక్షలు... గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యం: ఎమ్మెల్యే రాము...

V10TV న్యూస్ డెస్క్ 28 ఆగస్టు, 2026 5:39 PMకి 2,486 వీక్షణలు
గుడ్లవల్లేరులో రోడ్లకు రూ.74 లక్షల బూస్ట్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడ్లవల్లేరు, ఆగస్టు 28: గుడివాడ నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలో సాస్కి నిధులు రూ.74 లక్షలతో చేపట్టనున్న రెండు కీలక రోడ్ల అభివృద్ధి పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

విన్నకోట విలేజ్ రోడ్డు నుంచి సుబ్బి చెరువు రోడ్డు వరకు రూ.9 లక్షలతో, విన్నకోట ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కట్టమని చెరువు–చింతలకుంట రోడ్డు వరకు రూ.65 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు సహా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, కూటమి నాయకులు, పంచాయతీరాజ్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

రేవంత్‌కు ‘గోల్డ్ రాఖీ’.. సురేఖ వ్యాఖ్యల్లో ఆసక్తికర సంకేతం!

2 గంటల క్రితం 3,658

నాగబాబు కాదు.. చైర్మన్ ‘కొణిదెల నాగేంద్రరావు’!

3 గంటల క్రితం 2,537

భక్తిశ్రద్ధలతో సంతోషిమాత 17వ వార్షికోత్సవం

3 గంటల క్రితం 2,851

పక్షవాత బాధితుడికి రూ.6 లక్షల వైద్య భరోసా

3 గంటల క్రితం 1,368