శ్యామలాంబ ఆలయంలో తీర్థప్రసాదాల పంపిణీ
సుమారు 12 వేల మంది భక్తులకు అందజేసినట్లు నిర్వాహకుల వెల్లడి… ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ యువనేత బొండా రవితేజ… ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకరావు ఆధ్వర్యంలో కార్యక్రమం…

విజయవాడ, అక్టోబర్ 16: నగరంలోని 66వ డివిజన్ దావు బచ్చయ్య కాలనీలోని శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో శుక్రవారం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 12 వేల మంది భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువనేత బొండా రవితేజ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, వారితో మమేకమయ్యారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకరావు, ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

