సామర్లకోట ట్రాఫిక్ ఎస్ఐపై దాడి
వాహనాన్ని అడ్డంగా నిలపొద్దని చెప్పడంతో ఇద్దరి దౌర్జన్యం... మద్యం మత్తులో పిడిగుద్దులతో దాడి.. ఎస్ఐకి స్వల్ప గాయాలు... పారిపోయేందుకు యత్నించిన ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు...

సామర్లకోట: స్టేషన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ గరగరావుపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వాహనాన్ని అడ్డంగా నిలపడంతో దానిని తొలగించాలని ఎస్ఐ సూచించగా, మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్న ఇద్దరు ఆయనపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో ఎస్ఐ కిందపడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

