ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మను దర్శించుకున్న విశాఖ ఎంపీ భరత్

శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు… ఎంపీకి వేదాశీర్వచనం అందించిన ఆలయ పండితులు… భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లపై ఎంపీ ప్రశంసలు…

V10TV న్యూస్ డెస్క్ 12 అక్టోబర్, 2026 4:35 PMకి 3,791 వీక్షణలు
దుర్గమ్మను దర్శించుకున్న విశాఖ ఎంపీ భరత్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 12: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ సోమవారం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ శరన్నవరాత్రుల వేళ దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఉత్సవాలకు తరలివస్తున్న భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు, క్యూలైన్ల నిర్వహణ అభినందనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్న ఆలయ యంత్రాంగాన్ని ప్రశంసించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086