మద్యం మత్తులో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
దేవరకోటలో అర్ధరాత్రి దారుణ ఘటన… రాయితో కొట్టి తమ్ముడిని హతమార్చిన సోదరుడు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు…

ఘంటసాల, అక్టోబర్ 3: మద్యం మత్తులో చెలరేగిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. తమ్ముడిని సొంత అన్న రాయితో కొట్టి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకోట గ్రామానికి చెందిన చింతలపూడి రాజ్‌కుమార్ (40) గురువారం పింఛన్ తీసుకున్న అనంతరం మద్యం సేవించాడు. ఈ క్రమంలో స్థానికులతోపాటు తన అన్న విజయ్‌కుమార్‌తోనూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన విజయ్‌కుమార్ రాయితో రాజ్‌కుమార్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

