ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

నక్కా సుబ్బయ్య మృతి తీరని లోటు :మాజీ మంత్రి వెలంపల్లి

పార్థివదేహానికి మాజీ మంత్రి వెలంపల్లి నివాళి… కుటుంబ సభ్యులకు పరామర్శ—ప్రగాఢ సానుభూతి… అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 1:07 PMకి 4,127 వీక్షణలు
నక్కా సుబ్బయ్య మృతి తీరని లోటు :మాజీ మంత్రి వెలంపల్లి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 4: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నక్కా సుబ్బయ్య ఆకస్మిక మరణం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ వెలంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లికార్జునపేటలోని నివాసంలో ఉంచిన సుబ్బయ్య పార్థివదేహాన్ని వెలంపల్లి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుబ్బయ్య అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ నక్కా సుబ్బయ్యతో తనకున్న ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. సుబ్బయ్య కేవలం పార్టీ నాయకుడే కాదని, ప్రతి అడుగులోనూ తనకు అండగా నిలిచిన ఆత్మీయుడని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ఆయన నిస్వార్థంగా చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సుబ్బయ్య మృతి పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తనకు పూడ్చలేని లోటని వెలంపల్లి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ కష్టాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086