ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సుజనా చౌదరి దంపతులు

కుటుంబ సమేతంగా శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే… ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు… సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 4:40 PMకి 3,599 వీక్షణలు
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సుజనా చౌదరి దంపతులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 11: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి దంపతులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికీ త్వరితగతిన, సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఉత్సవాల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086