వర్షానికే ఆసుపత్రి ప్రాంగణం జలమయం!
ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని ముంచెత్తిన వర్షపు నీరు రాకపోకలకు అంతరాయం.. రోగులు, సహాయకుల తీవ్ర ఇబ్బందులు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితుల విజ్ఞప్తి

విజయవాడ, సెప్టెంబర్ 23 : విజయవాడలో కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం జలమయమైంది. వర్షపు నీరు ఆసుపత్రి పరిసరాల్లో నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రధాన మార్గాల్లోనూ నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు నీటిలో నడవాల్సి రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

