గన్నవరం డీఎస్పీగా జయకృష్ణ బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని వెల్లడి… ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ… సాధారణ బదిలీల్లో భాగంగా గన్నవరం డివిజన్‌కు రాక…

గన్నవరం, అక్టోబర్ 2: గన్నవరం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా కె. జయకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన గన్నవరం డివిజన్‌కు వచ్చారు. గతంలో గన్నవరం డీఎస్పీగా పనిచేసిన చలసాని శ్రీనివాస్ బదిలీపై నందిగామ వెళ్లారు. అనంతరం నాలుగు నెలలుగా ఎయిర్‌పోర్టు డీఎస్పీ ధర్మేంద్ర గన్నవరం డివిజన్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. తాజాగా జయకృష్ణను ప్రభుత్వం గన్నవరం డీఎస్పీగా నియమించింది. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ.. గన్నవరం సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా నిర్భయంగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేస్తూ, సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

