కాకుమాను కుటుంబానికి అండగా ఉంటాం
ఒంగోలులో వైయస్ జగన్ పర్యటన... దివంగత కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులకు పరామర్శ... పార్టీకి ఆయన మృతి తీరని లోటని ఆవేదన...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఒంగోలు, సెప్టెంబర్ 29: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలులో పర్యటించారు. క్లౌపేటలోని వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ దివంగత కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజశేఖర్ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా

ఉండాలని వారిని ఓదార్చారు. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావంతో రాజశేఖర్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. రాజశేఖర్ కుటుంబం ఒంటరిది కాదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.

