ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పేదల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే పట్టాభిషేకం

ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడ వాసులకు శాశ్వత ఇంటి పట్టాలు అందించడం ఆనందకరం... ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధే చంద్రబాబు లక్ష్యం... గత పాలనలో అవినీతి మాత్రమే పెరిగింది.. కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతోంది...

V10TV న్యూస్ డెస్క్ 30 సెప్టెంబర్, 2026 11:53 AMకి 2,891 వీక్షణలు
పేదల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే పట్టాభిషేకం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, సెప్టెంబర్‌ 30: విజయవాడ నగరంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందించడం సంతోషకరమని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు. పేద కుటుంబాలకు ఆస్తిపై పూర్తి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఒక మహర్షిలా ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయన చేసిన ఈ మేలు లబ్ధిదారుల కుటుంబాలు జీవితాంతం గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు రాజకీయాల గురించి ఆలోచిస్తారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పారు. వైసీపీ నాయకులకు రాష్ట్ర సంపదను దోచుకోవడం అలవాటైతే, చంద్రబాబుకు సంపద సృష్టించి ప్రజలకు పంచడం అలవాటని వ్యాఖ్యానించారు. జగన్‌ పాలనలో అవినీతి పూర్తిస్థాయిలో పెరిగి అభివృద్ధి శూన్యంగా మారిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086