ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పేదల వైద్యానికి రూ.2.70 లక్షల ఆర్థిక సాయం

ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ… ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా… అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: ఎమ్మెల్యే బొండా ఉమా…

V10TV న్యూస్ డెస్క్ 12 అక్టోబర్, 2026 7:46 PMకి 2,899 వీక్షణలు
పేదల వైద్యానికి రూ.2.70 లక్షల ఆర్థిక సాయం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 12: ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు చేయించుకోలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సెంట్రల్‌ నియోజకవర్గం 24వ డివిజన్‌ గిరిపురం ప్రాంతానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2.70 లక్షల ఆర్థిక సాయం చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు మెరుగైన చికిత్స అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. వైద్య అవసరాల కోసం అప్పుల పాలవుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొంత ఊరటనిస్తోందని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడంతోపాటు అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్‌, గడ్డం రాజు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086