ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గుడివాడకు ముప్పై ఏళ్ల నీటి ప్రణాళిక

తాగునీటి వసతుల మెరుగుకు అమృత్‌ పథకంలో రూ.22.50 కోట్లు… ఎన్టీఆర్‌ కాలనీలో నీటి ట్యాంకు, సరఫరా వ్యవస్థకు రూ.10.90 కోట్లు… మురుగునీటి శుద్ధి, భూగర్భ డ్రైనేజీకి రూ.36 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాము వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 4:24 PMకి 2,479 వీక్షణలు
గుడివాడకు ముప్పై ఏళ్ల నీటి ప్రణాళిక — చిత్రం 1
గుడివాడకు ముప్పై ఏళ్ల నీటి ప్రణాళిక — చిత్రం 2
గుడివాడకు ముప్పై ఏళ్ల నీటి ప్రణాళిక — చిత్రం 3

1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

గుడివాడ, అక్టోబర్‌ 8: రాబోయే ముప్పై ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుడివాడ పట్టణ తాగునీటి వ్యవస్థకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. పట్టణ విస్తరణ, పెరిగే జనాభాకు అనుగుణంగా నీటి నిల్వ, సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరా కేంద్రాలు, కొత్త పైప్‌లైన్లు, పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమగ్ర డిజైన్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రాజెక్టు నిపుణుడు టి.ఆంజనేయులు ప్రణాళిక వివరాలను వెల్లడించారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతోపాటు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు కూడా తాగునీరు అందించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు వివరించారు. బేతవోలు, నాగవరప్పాడు చెరువుల ఆధునికీకరణలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై సమావేశంలో చర్చించారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపి పనులను వేగవంతం చేయాలని రాము ఆదేశించారు. రైల్వే గేట్ల వద్ద పైప్‌లైన్ల నిర్మాణానికి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వేసవి నీటి నిల్వ చెరువులు, ఎత్తైన నీటి ట్యాంకులు, పంపిణీ వ్యవస్థ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతుల మెరుగుదలకు అమృత్‌ రెండో దశ

గుడివాడకు ముప్పై ఏళ్ల నీటి ప్రణాళిక — అదనపు చిత్రం 2
గుడివాడకు ముప్పై ఏళ్ల నీటి ప్రణాళిక — అదనపు చిత్రం 3

పథకం కింద రూ.22.50 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సెంటు స్థలాల ఎన్టీఆర్‌ కాలనీలో నీటి ట్యాంకు నిర్మాణం, పంపిణీ వ్యవస్థకు రూ.10.90 కోట్లు, పట్టణంలో మురుగునీటి శుద్ధి కేంద్రం, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధికి మరో రూ.36 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతిక, స్థానిక సమస్యలతో కొన్ని పనుల్లో జాప్యం జరుగుతోందని రాము పేర్కొన్నారు. పనులు ప్రారంభించే ముందే అడ్డంకులను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి నిరంతరాయంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితర మౌలిక వసతులను భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ సింహాద్రి మనోహర్‌, ప్రజారోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్‌ ప్రవీణ్‌, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ పాండురంగ, మున్సిపల్‌ ఇంజినీర్‌ సతీష్‌ చంద్ర, గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ జోనల్‌ మేనేజర్‌ బేబీ, ఇంజినీర్లు రాజేంద్రప్రసాద్‌, కిషోర్‌, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, మెగా సంస్థ ప్రతినిధులు, ప్రాజెక్టు నిపుణులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086