ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

క్రీడలతో ఐక్యతకు బలం

బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అగ్ని భద్రతపై అవగాహన కల్పిస్తున్న సంస్థ సేవలు అభినందనీయం అమరావతి చాప్టర్ సభ్యులతో రెండో విడత పోటీల నిర్వహణ

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 4:18 PMకి 3,364 వీక్షణలు
క్రీడలతో ఐక్యతకు బలం — చిత్రం 1
క్రీడలతో ఐక్యతకు బలం — చిత్రం 2
క్రీడలతో ఐక్యతకు బలం — చిత్రం 3

1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 26 (ఆంధ్రప్రభ): సభ్యుల మధ్య క్రీడా స్ఫూర్తి, ఐక్యతను పెంపొందించేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు. ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అసోసియేషన్ సేవలందించడం అభినందనీయమన్నారు. క్రీడా పోటీల నిర్వహణతోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం సంతోషకరమని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్వచ్ఛంద సంస్థల

క్రీడలతో ఐక్యతకు బలం — అదనపు చిత్రం 2
క్రీడలతో ఐక్యతకు బలం — అదనపు చిత్రం 3

సేవలు ఎంతో అవసరమన్నారు. సేవా దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ సభ్యులను ఆయన అభినందించారు. అమరావతి చాప్టర్ అధ్యక్షుడు కాంతారావు మాట్లాడుతూ 2017లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చాప్టర్ ప్రారంభమైందన్నారు. గత ఏడాది తొలి విడత బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించామని, ప్రస్తుతం రెండో విడత పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫైర్ సర్వీసెస్, సెక్యూరిటీ రంగాల ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరాదారులు తమ సంస్థలో సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు సభ్యుల్లో ఐకమత్యాన్ని పెంపొందించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086