రూ.5.75 లక్షల కలెక్షన్ నగదుతో ఏజెంట్ పరార్
వసూలు చేసిన సొమ్మును సంస్థలో జమ చేయకుండా అదృశ్యం… సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయిన సతీష్‌కుమార్… యజమాని ఫిర్యాదుతో కొత్తపేట పోలీసుల దర్యాప్తు…

విజయవాడ: ప్రైవేటు సంస్థకు చెందిన రూ.5.75 లక్షల కలెక్షన్ నగదును జమ చేయకుండా ఏజెంట్ కనిపించకుండా పోయిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. బాధిత సంస్థ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సతీష్‌కుమార్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సంస్థ తరఫున కలెక్షన్‌కు వెళ్లిన అతడు రూ.5.75 లక్షల నగదును వసూలు చేసినట్లు సంస్థ యజమాని పార్థసారథి పోలీసులకు తెలిపారు. వసూలు చేసిన నగదును సంస్థలో జమ చేయకుండా సతీష్‌కుమార్ తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. యజమాని ఫిర్యాదు ఆధారంగా కొత్తపేట పోలీసులు విచారణ ప్రారంభించి, అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

