టోల్ కట్టకుండా.. బారియర్లు బద్దలుకొట్టి!
వెదురుపావులూరు టోల్‌గేట్ వద్ద లారీల హల్‌చల్… పద్దెనిమిది లారీల్లో పది లారీలు దూసుకెళ్లిన వైనం… ఎనిమిది లారీలను అడ్డుకున్న గన్నవరం పోలీసులు…

గన్నవరం, అక్టోబర్ 4: టోల్ రుసుము చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించిన లారీలు టోల్‌గేట్ బారియర్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన గన్నవరం పరిధిలోని వెదురుపావులూరు టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. మొత్తం పద్దెనిమిది లారీలు టోల్ రుసుము చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, వాటిలో పది లారీలు టోల్‌గేట్‌ను ఢీకొట్టి వెళ్లిపోయాయి. మిగిలిన ఎనిమిది లారీలను పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ టోల్ ప్లాజాకు చేరుకొని లారీలను పక్కకు పెట్టించారు. తనిఖీల్లో ఒక లారీ డ్రైవర్ వద్ద సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దూసుకెళ్లిన లారీల వివరాలను గుర్తించి తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

