ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మ భక్తులకు సాంకేతిక కవచం!

ఏఐ కెమెరాల నిఘాలో ఇంద్రకీలాద్రి.. క్యూలైన్ల నుంచి ఘాట్‌రోడ్ల వరకు పర్యవేక్షణ… భక్తుల రద్దీ లెక్కింపు.. దర్శన సమయం అంచనాకు ఆధునిక వ్యవస్థ… చిన్నారుల భద్రతకు క్యూఆర్‌ రిస్ట్‌బ్యాండ్లు.. వాహనాల నియంత్రణకు స్మార్ట్‌ కెమెరాలు…

V10TV న్యూస్ డెస్క్ 12 అక్టోబర్, 2026 10:52 AMకి 3,954 వీక్షణలు
దుర్గమ్మ భక్తులకు సాంకేతిక కవచం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 12: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు దేవస్థానం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అమ్మవారి దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు, డిజిటల్‌ ప్రదర్శన బోర్డులు, క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థలు, సమగ్ర పర్యవేక్షణ కేంద్రాలను ఐటీ ఏర్పాట్లలో భాగంగా ప్రతిపాదించింది. దర్శన క్యూలైన్ల నుంచి ఘాట్‌రోడ్లు, పార్కింగ్‌ ప్రాంతాలు, అన్నప్రసాద కేంద్రాల వరకు సాంకేతిక నిఘా విస్తరించేలా చర్యలు చేపట్టనుంది. రద్దీని గుర్తించే ఏఐ కెమెరాలు దర్శన క్యూలైన్లలో భక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు ఏఐ కెమెరాలను వినియోగించనున్నారు. క్యూలైన్లలో ప్రవేశం, నిష్క్రమణ, భక్తుల సంఖ్య ఆధారంగా దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయనున్నారు. ఈ వివరాలను డిజిటల్‌ బోర్డుల ద్వారా భక్తులకు తెలియజేసేలా వ్యవస్థను రూపొందించారు. అన్నప్రసాద కేంద్రాల్లోనూ రద్దీని లెక్కించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు ప్రతిపాదించారు. హోల్డింగ్‌ ప్రాంతాలను బ్లాకులుగా విభజించి రద్దీకి అనుగుణంగా భక్తులను క్రమపద్ధతిలో ముందుకు పంపించే విధానాన్ని రూపొందించారు. చిన్నారులకు క్యూఆర్‌ రక్షణ ఉత్సవాలకు కుటుంబాలతో వచ్చే చిన్నారులు రద్దీలో తప్పిపోకుండా క్యూఆర్‌ కోడ్‌తో కూడిన చేతి పట్టీలను వినియోగించనున్నారు. చిన్నారి తప్పిపోయినప్పుడు చేతి పట్టీపై ఉన్న కోడ్‌ను స్కాన్‌ చేసి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వివరాలను గుర్తించి తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేలా ఏర్పాట్లు రూపొందించారు. ఘాట్‌రోడ్లపై వాహనాలకు నిఘా ఇంద్రకీలాద్రికి వచ్చే ఘాట్‌రోడ్లపై వాహనాల నంబరు ప్లేట్లను గుర్తించే ప్రత్యేక కెమెరాలను వినియోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వాహనాలకు జారీ చేసిన పాస్‌ల చెల్లుబాటును పరిశీలించి అనధికార ప్రవేశాన్ని నియంత్రించనున్నారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తించడం, వాహనాలను క్రమబద్ధీకరించడం కోసం ఏఐ ఆధారిత పార్కింగ్‌ నిర్వహణ వ్యవస్థను ప్రతిపాదించారు. భక్తుల రవాణాకు ఉపయోగించే బస్సుల కదలికలను జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షించేలా చర్యలు రూపొందించారు. లడ్డూ ప్రసాదానికీ స్మార్ట్‌ విధానం లడ్డూ ప్రసాదం పంపిణీలో రద్దీని తగ్గించేందుకు స్మార్ట్‌ లడ్డూ వెండింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఐటీ ప్రణాళికలో చేర్చారు. భక్తులు ఆన్‌లైన్‌ బుకింగ్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా ప్రసాదాన్ని పొందేలా ఈ విధానాన్ని రూపొందించారు. మరోవైపు చెత్తకుండీలు నిండినప్పుడు పారిశుద్ధ్య సిబ్బందికి సమాచారం అందించే స్మార్ట్‌ అలర్ట్‌ వ్యవస్థను కూడా ప్రతిపాదించారు. ఒకే వేదికపై సమగ్ర పర్యవేక్షణ దర్శన రద్దీ, ట్రాఫిక్‌, పార్కింగ్‌, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, సిబ్బంది విధుల సమాచారాన్ని ఒకే డిజిటల్‌ డ్యాష్‌బోర్డులో పరిశీలించేలా ప్రణాళిక రూపొందించారు. భక్తుల అభిప్రాయాలను క్యూఆర్‌ కోడ్‌, ఫోన్‌ ఆధారిత వ్యవస్థల ద్వారా సేకరించి సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు ప్రతిపాదించారు. వైద్య కేంద్రాలు, వాలంటీర్లు, భద్రతా సిబ్బంది వివరాలను కూడా డిజిటల్‌ విధానంలో నమోదు చేయనున్నారు.మొత్తంగా భక్తుల రద్దీ నియంత్రణ నుంచి చిన్నారుల భద్రత, వాహనాల పర్యవేక్షణ, ప్రసాద పంపిణీ వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా దసరా ఉత్సవాలను మరింత సమర్థంగా నిర్వహించాలని దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086