వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం
చైర్మన్‌గా చీపుళ్ల వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకరణ… నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన బుద్ధా వెంకన్న… ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి…

విజయవాడ, అక్టోబరు 1: బ్రాహ్మణ వీధిలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో పాలకమండళ్ల పాత్ర కీలకమన్నారు. కమిటీ సభ్యులు సమష్టిగా పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆలయ పవిత్రతను కాపాడాలని సూచించారు. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. దేవస్థానం అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీపుళ్ల వెంకటేశ్వరరావు, సభ్యులు గోలి శ్రీనివాసరావు, కోడెబోయిన స్రవంతి, మామిడి సుశీల, ఎన్. గౌరీరెడ్డి, లక్కు శాంతి, లింగంపల్లి రామలక్ష్మి, మురళీనాయక్, రెడ్డిపల్లి అనిత, పచ్చిపులుసు వెంకటప్రసాద్, కిలారి శ్రీనివాసరావుతోపాటు భక్తులు, స్థానిక ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

