ఆశా వర్కర్ల సమస్యలపై సుజనా సానుకూల స్పందన
కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి… సెలవులు, టీఏ–డీఏ, బీమా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి… జనాభాకు అనుగుణంగా పోస్టులు పెంచి ఖాళీలు భర్తీ చేయాలని కోరిక…

విజయవాడ, అక్టోబరు 6: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమలోని ఎన్డీయే కార్యాలయంలో మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రతతోపాటు అన్ని రకాల సెలవులు, ప్రయాణ భత్యం, దినసరి భత్యం, బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల పోస్టులను పెంచి, ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరగా, ఎమ్మెల్యే సుజనా చౌదరి సానుకూలంగా స్పందించారు.

