విజయవాడ ఉత్సవ్ 2.0కు గవర్నర్‌కు ఆహ్వానం
లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఎంపీ కేశినేని చిన్ని భేటీ… నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా ఉత్సవాల నిర్వహణ… ఉత్సవాల విశేషాలను గవర్నర్‌కు వివరించిన ఎంపీ…

విజయవాడ, అక్టోబర్ 12: విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆహ్వానించారు. సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ ఉత్సవాల నిర్వహణ, ప్రత్యేకతలను వివరించారు. విజయవాడ నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా విజయవాడ ఉత్సవ్ 2.0ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ భేటీలో కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ సభ్యులు పాల్గొన్నారు.

