‘దీక్ష’లో కృష్ణాష్టమి సందడి
విద్యార్థుల కేరింతల మధ్య ఉట్టి కొట్టే పోటీ... విజేతలకు నగదు బహుమతులు అందజేసిన యాజమాన్యం... సంప్రదాయ వేడుకలతో పండుగ వాతావరణం..

నందిగామ, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): నందిగామలోని దీక్ష జూనియర్ కళాశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
కృష్ణాష్టమిని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉట్టి కొట్టే పోటీ నిర్వహించారు. విద్యార్థుల కేరింతలు, చప్పట్ల మధ్య పోటీ ఉత్సాహభరితంగా సాగింది. సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన వేడుకలతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఉట్టి కొట్టే పోటీలో విద్యార్థులు అఖిల్, భువనేశ్, విద్యార్థినులు సంధ్యారాణి, సరోజినీ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. వారికి కళాశాల యాజమాన్యం నగదు బహుమతులు అందజేసి అభినందించింది.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హనీఫ్, రామారావు, రాము, నరసింహారావు, ఉపేంద్ర, ఇన్‌చార్జిలు గాలేషా, జిలాని, మారుతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కృష్ణాష్టమి వేడుకలు ఆద్యంతం సందడిగా సాగాయి.

