స్నేహలయలో వృద్ధులకు ఆత్మీయ వేడుక
ఆకూరి శ్వేతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవం… పండ్ల పంపిణీ.. వృద్ధులతో కలిసి కేక్ కటింగ్… వృద్ధులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
మచిలీపట్నం, అక్టోబర్ 1: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆకూరి శ్వేతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని స్నేహలయ వృద్ధాశ్రమంలో బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన అధికారి బి.ప్రదీప్‌కుమార్, మహిళా ఎస్సై జాస్మిన్, పద్మావతి కళాశాల విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. వారితో కలిసి కేక్

కట్ చేసి కొంతసేపు ఆత్మీయంగా గడిపారు. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వృద్ధులను గౌరవించడం, వారి అనుభవాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆకూరి శ్వేత తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, వృద్ధాశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

