ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ప్రార్థనా మందిరానికి బొండా ఉమా శంకుస్థాపన

అజిత్‌సింగ్‌నగర్‌లో పరిశుద్ధ సిలువ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన ప్రార్థనా మందిరాల నిర్మాణ రుసుములకు ప్రభుత్వం మినహాయింపులు చర్చి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానన్న ఎమ్మెల్యే బొండా ఉమా

V10TV న్యూస్ డెస్క్ 24 సెప్టెంబర్, 2026 5:45 PMకి 3,656 వీక్షణలు
ప్రార్థనా మందిరానికి బొండా ఉమా శంకుస్థాపన — చిత్రం 1
ప్రార్థనా మందిరానికి బొండా ఉమా శంకుస్థాపన — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 24: శాసనాలను సైతం మార్చగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉందని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఆర్సీఎం పరిశుద్ధ సిలువ దేవాలయ నూతన నిర్మాణానికి గురువారం వైభవంగా శంకుస్థాపన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవునికి అసాధ్యమైనదేదీ లేదన్నారు. గతంలో చర్చిలు, మసీదులు, దేవాలయాల నిర్మాణానికి అనుమతులు, ఇతర రుసుముల రూపంలో అధికంగా ఖర్చయ్యేదని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ నిబంధనలు–2017లో సవరణలు చేసి మతపరమైన ప్రార్థనా మందిరాల నిర్మాణ అనుమతి రుసుములు, ఇతర ఛార్జీల నుంచి మినహాయింపులు కల్పించినట్లు తెలిపారు. ఈ సవరణలతో అజిత్‌సింగ్‌నగర్‌ ఆర్సీఎం చర్చి నూతన నిర్మాణానికి అనుమతులు సులభతరమయ్యాయని

ప్రార్థనా మందిరానికి బొండా ఉమా శంకుస్థాపన — అదనపు చిత్రం 2

పేర్కొన్నారు. దీనిని యేసుప్రభువు చేసిన గొప్ప కార్యంగా భావిస్తున్నానన్నారు. దేవాలయ నిర్మాణానికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. విజయవాడ మేత్రాసనాధిపతి మోస్ట్‌ రెవరెండ్‌ డాక్టర్‌ జోసెఫ్‌ రాజారావు తెలగతోటి మాట్లాడుతూ నూతన దేవాలయ నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు దేవుడు అందించిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు. సంఘస్తులందరూ ఒకే కుటుంబంలా ఐక్యంగా ఉంటూ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక దివ్యబలి పూజ నిర్వహించారు. అజిత్‌సింగ్‌నగర్‌ విచారణ గురువు ఫాదర్‌ గడ్డం జోజి, ఫాదర్లు ఎం.గాబ్రియేల్‌, ఎం.చిన్నప్ప, కిషోర్‌, అనిల్‌ ఫ్రాన్సిస్‌, మరియదాస్‌, ఫ్రాన్సిస్‌, స్లీవరాజు, విజయ్‌, కిరణ్‌, వినోద్‌, సిస్టర్లు, సంఘ పెద్దలు బూరె రాజేష్‌, పాగోలు రాము, వై.జాన్‌పీటర్‌, ఆర్‌.ఆంటోని, బాలరాజు, జోజియప్ప, చిన్నప్ప, రవికుమార్‌, ప్రదీప్‌కుమార్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086