ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఇంటి కప్పుపై సౌరశక్తి.. విద్యుత్‌ బిల్లులో ఆదా!

ప్రతి ఇంటా సౌర విద్యుత్‌ వినియోగంపై అవగాహన… పటమటలో ‘సేవాసేతు అభియాన్‌’ ప్రారంభం… ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె పిలుపు…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 6:04 PMకి 1,902 వీక్షణలు
ఇంటి కప్పుపై సౌరశక్తి.. విద్యుత్‌ బిల్లులో ఆదా! — చిత్రం 1
ఇంటి కప్పుపై సౌరశక్తి.. విద్యుత్‌ బిల్లులో ఆదా! — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్‌ పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. పదో డివిజన్‌లోని పటమటలో మంగళవారం ‘సేవాసేతు అభియాన్‌’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పంటకాలువ రోడ్డు, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, న్యూ పోస్టల్‌ కాలనీ, పటమట ప్రాంతాల ప్రజలకు సౌర విద్యుత్‌ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ ప్రతి ఇంటా సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించి, కుటుంబాల విద్యుత్‌ ఖర్చును తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పీఎం సూర్యఘర్‌ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీలు అందిస్తున్నట్లు చెప్పారు. సౌర

ఇంటి కప్పుపై సౌరశక్తి.. విద్యుత్‌ బిల్లులో ఆదా! — అదనపు చిత్రం 2

సాంకేతికతతో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు సేవాసేతు అభియాన్‌ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ, రుణ సదుపాయం, సౌర పలకల అమరికకు సంబంధించిన వివరాలను ఈ కార్యక్రమంలో తెలియజేస్తారని పేర్కొన్నారు. అనువైన పైకప్పు ఉన్న గృహ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తితో తమ బిల్లులను తగ్గించుకోవడంతోపాటు దేశ విద్యుత్‌ అవసరాలకు తోడ్పాటు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ అధికారులు విశ్వేశ్వర ప్రసాద్‌, రామకృష్ణ, రాజశేఖర్‌, ఫణీంద్ర, ఏడుకొండలు, పార్టీ నాయకులు ముమ్మనేని ప్రసాద్‌, కోనేరు రాజేష్‌, ఆజాద్‌, తుమ్మల వెంకటరత్నం, పాతూరి సాంబశివరావు, జాస్తి సురేష్‌, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086