ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

వైభవంగా వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

ఆర్‌ఆర్‌పేట దేవస్థానంలో ఇరవై ఐదో వార్షిక వేడుకలు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి చంటి దంపతులు ఆలయంలో హోమాలు, వేదపారాయణం

V10TV న్యూస్ డెస్క్ 24 సెప్టెంబర్, 2026 2:57 PMకి 2,371 వీక్షణలు
వైభవంగా వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు — చిత్రం 1
వైభవంగా వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

ఏలూరు, సెప్టెంబర్‌ 24: ఏలూరు నగరంలో గురువారం నిర్వహించిన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య చంటి పాల్గొన్నారు. ఆర్‌ఆర్‌పేటలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఇరవై ఐదో వార్షిక పవిత్రోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం పత్తేబాదలో నిర్మించనున్న ఉద్యోగినుల వసతిగృహానికి శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ పాలడుగు వెంకట రమాదేవి ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బడేటి చంటి, ఆయన సతీమణి మీనా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను పట్టువస్త్రాలతో సత్కరించారు. ప్రధాన

వైభవంగా వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు — అదనపు చిత్రం 2

అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమాలు, వేదపారాయణం నిర్వహించారు. అనంతరం పత్తేబాద నర్సింగ్‌ పాఠశాల ప్రాంగణంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఉద్యోగినుల వసతిగృహానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఉద్యోగం, విద్య కోసం ఏలూరుకు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు ఈ భవనం దోహదపడుతుందని తెలిపారు. వసతిగృహ నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా అందించిన కొవ్వలి గ్రామానికి చెందిన బూసి యేసేబు, ప్రభావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎంబీఎస్‌వీ ప్రసాద్‌, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086