ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భక్తుల సౌకర్యమే లక్ష్యంగా దసరా సన్నాహాలు

ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్‌... లడ్డూ పోటు, అన్నదాన భవనాల్లో పనులపై ఆరా... డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశం...

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 7:32 PMకి 3,850 వీక్షణలు
భక్తుల సౌకర్యమే లక్ష్యంగా దసరా సన్నాహాలు — చిత్రం 1
భక్తుల సౌకర్యమే లక్ష్యంగా దసరా సన్నాహాలు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 29: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై విస్తృతంగా పర్యటించి ఉత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన లడ్డూ పోటు, అన్నదాన భవనాలను తనిఖీ చేసిన ఆయన మిగిలిన చిన్నచిన్న పనులను సైతం ఉత్సవాల నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. భక్తులకు అందించే ప్రసాదాలు రుచికరంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. అన్నప్రసాద వితరణ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన

భక్తుల సౌకర్యమే లక్ష్యంగా దసరా సన్నాహాలు — అదనపు చిత్రం 2

వసతులన్నీ ముందుగానే సిద్ధం చేయాలన్నారు. అనంతరం కనకదుర్గానగర్‌లో జరుగుతున్న డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో వేగవంతం చేస్తున్నట్లు ఈవో తెలిపారు. క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రసాదాల పంపిణీ తదితర విభాగాల్లో చిన్న లోపానికీ తావులేకుండా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ఏర్పాట్లన్నీ పూర్తిచేసి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో దేవస్థానం కార్యనిర్వాహక ఇంజినీర్‌, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086