ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ

పార్టీ సిద్ధాంతాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని పవన్‌ పిలుపు… ప్రజాసేవలో సమష్టిగా ముందుకు సాగాలని దిశానిర్దేశం… బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన రాధా రాజకీయ నిర్ణయం…

V10TV న్యూస్ డెస్క్ 14 అక్టోబర్, 2026 6:41 PMకి 4,913 వీక్షణలు
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 14: దివంగత ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన కేంద్ర కార్యాలయానికి తన అనుచరులతో కలిసి చేరుకున్న రాధాకృష్ణను పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం రాధాకృష్ణ తన వెంట వచ్చిన అనుచరులను పవన్‌ కల్యాణ్‌కు పరిచయం చేశారు. వారందరితో పవన్‌ కల్యాణ్‌ ఆప్యాయంగా మాట్లాడి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. రాధాకృష్ణ జనసేనలో చేరడం విజయవాడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వంగవీటి కుటుంబానికి నగర రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాధాకృష్ణకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, విజయవాడలో పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే అంశాలపై ఆసక్తి నెలకొంది. మేయర్‌ పీఠంపై కొత్త చర్చ విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రాధాకృష్ణ చేరికకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే మేయర్‌ అభ్యర్థిత్వానికి సంబంధించి రాధాకృష్ణతోపాటు ఆయన సతీమణి పుష్పవల్లి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కూటమిలో మేయర్‌ పదవి జనసేనకు కేటాయిస్తారా? రాధాకృష్ణకు అభ్యర్థిత్వం దక్కుతుందా? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086