ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

శ్రీశైలం దేవస్థానానికి 4 టన్నుల కూరగాయల వితరణ

అన్నప్రసాద ట్రస్టుకు విజయవాడ దాతల చేయూత… కూరగాయల వాహనాన్ని ప్రారంభించిన పట్టాభిరామ్ దంపతులు… సేవా కార్యక్రమంలో భాగస్వాములైన పల్చూరి నాగేశ్వరరావు, నాగేంద్ర, శ్రీనివాస్…

V10TV న్యూస్ డెస్క్ 14 అక్టోబర్, 2026 4:32 PMకి 3,517 వీక్షణలు
శ్రీశైలం దేవస్థానానికి 4 టన్నుల కూరగాయల వితరణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 14: శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అన్నప్రసాద ట్రస్టుకు విజయవాడకు చెందిన దాతలు నాలుగు టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. పల్చూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమకూర్చిన కూరగాయలను బుధవారం ప్రత్యేక వాహనంలో శ్రీశైలానికి తరలించారు. విజయవాడ రామవరప్పాడులోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ మెడోస్ వద్ద కూరగాయల వాహనాన్ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆయన సతీమణి చందన ప్రారంభించారు. వాహనానికి కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి శ్రీశైలానికి పంపించారు. శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణలో ఉపయోగపడేలా ఈ కూరగాయలను సమకూర్చారు. ఈ సేవా కార్యక్రమంలో పల్చూరి నాగేశ్వరరావు, నాగేంద్ర, బాలాజీ స్వీట్స్ శ్రీనివాస్ భాగస్వాములయ్యారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086