నేతన్నలకు రూ.25 వేల సాయం త్వరలోనే
నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం… రెండో విడతలో 36 వేలకుపైగా దరఖాస్తులు… లబ్ధిదారుల ఎంపికకు అక్టోబరు 3 వరకు అవకాశం…

విజయవాడ, అక్టోబరు 1: చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఇప్పటికే ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, త్వరలో కొత్త పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ‘నేతన్నల సేవలో’ పథకం రెండో విడతలో భాగంగా 36 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు విధించిన గడువును అక్టోబరు 3వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. త్వరలోనే రూ.25 వేల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు.

