బంగారం దుకాణం పైభాగం కూలి ద్విచక్రవాహనం ధ్వంసం
తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఘటన వన్‌టౌన్ పాత శివాలయం ప్రాంతంలో కూలిన దుకాణం వెలుపలి నిర్మాణం ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 24: తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వన్‌టౌన్ పాత శివాలయం ప్రాంతంలోని ఓ బంగారం దుకాణం వెలుపలి అలంకరణ నిర్మాణం కూలిపోయింది. శిథిలాలు దుకాణం ముందు నిలిపిన ద్విచక్రవాహనంపై పడటంతో అది

ధ్వంసమైంది. నిర్మాణం కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వరుస వర్షాల నేపథ్యంలో పాత, బలహీన నిర్మాణాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

