ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గాంధీజీ సేవలు స్ఫూర్తిదాయకం: సామినేని ఉదయభాను

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ… మహిళకు జీవనోపాధిగా కుట్టుమిషన్ అందజేత… అహింసా మార్గంలోనే స్వాతంత్ర్య సాధన…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 2:11 PMకి 2,543 వీక్షణలు
గాంధీజీ సేవలు స్ఫూర్తిదాయకం: సామినేని ఉదయభాను — చిత్రం 1
గాంధీజీ సేవలు స్ఫూర్తిదాయకం: సామినేని ఉదయభాను — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

జగ్గయ్యపేట, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని జగ్గయ్యపేటలోని తన నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ జనసేన నాయకుడు గుర్రం రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలల్లో చదువుతున్న 11 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. గోపినేనిపాలెం గ్రామానికి చెందిన మేఘావత్ రేణుకకు జీవనోపాధి కోసం కుట్టుమిషన్‌ను ఉదయభాను, ఆయన సతీమణి విమలభాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో పోరాడి

గాంధీజీ సేవలు స్ఫూర్తిదాయకం: సామినేని ఉదయభాను — అదనపు చిత్రం 2

దేశానికి స్వాతంత్ర్యం సాధించారని కొనియాడారు. బ్రిటిష్ పాలకులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా గాంధీజీ అహింసా మార్గాన్ని వీడలేదన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన గుర్రం రంజిత్‌కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకరరావు, కౌన్సిలర్లు కొలగాని రాము, కాశి కిషోర్, మాజీ కౌన్సిలర్లు చారుగుండ్ల కొండా, శేషం ప్రసాద్, మరిశెట్టి కోటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు నాయక్, జనసేన నాయకులు మేడూరి వెంకటాద్రి, ఈమని కిషోర్, కొమ్మరవపు భానుప్రసాద్, సామినేని రాము, పెద్దాపురపు సుధీర్, తాటకనూరి శ్రీనివాసబ్రహ్మం, దాసరి శ్రీనివాసరావు, గుంటుపల్లి సీతారాముడు, దేవరగట్ల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086