ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సౌర విద్యుత్‌తో ఇంటి ఖర్చులకు ఉపశమనం

ప్రధాని సూర్య ఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి… అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనాలు చేరాలి… సౌర విద్యుత్‌ అవగాహన శిబిరంలో ఎమ్మెల్యే బొండా ఉమా…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 2:32 PMకి 2,902 వీక్షణలు
సౌర విద్యుత్‌తో ఇంటి ఖర్చులకు ఉపశమనం — చిత్రం 1
సౌర విద్యుత్‌తో ఇంటి ఖర్చులకు ఉపశమనం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకోవచ్చని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని విద్యుత్‌ శాఖ సెక్షన్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘సేవా సేతు’ సౌర విద్యుత్‌ అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వినియోగదారులతో మాట్లాడి సౌర విద్యుత్‌ వినియోగం, పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యుత్‌ పొదుపుతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని తెలిపారు. పథకానికి

సౌర విద్యుత్‌తో ఇంటి ఖర్చులకు ఉపశమనం — అదనపు చిత్రం 2

సంబంధించిన నమోదు ప్రక్రియ, అర్హతలు, పైకప్పులపై సౌర విద్యుత్‌ వ్యవస్థల ఏర్పాటు తదితర అంశాలను విద్యుత్‌ శాఖ అధికారులు వినియోగదారులకు వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని బొండా ఉమా పేర్కొన్నారు. అర్హులైన వినియోగదారులకు నమోదులో సహకరించి, పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా విద్యుత్‌ శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌, ప్రాజెక్టుల డైరెక్టర్‌, విజయవాడ పట్టణ కార్యనిర్వాహక ఇంజినీర్‌, డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీర్‌, అజిత్‌సింగ్‌నగర్‌ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌తోపాటు విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086