కార్యకర్తల కుటుంబాలకు పార్టీ భరోసా
ముగ్గురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.15 లక్షల బీమా సాయం ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, సెప్టెంబర్ 4: ప్రమాదాల్లో మృతి చెందిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సభ్యత్వ బీమా పథకం కింద మంజూరైన రూ.15 లక్షల చెక్కులను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ప్రజావేదిక కార్యాలయంలో అందజేశారు. గుడ్లవల్లేరుకు చెందిన గుమ్మడి శ్రావణి, అంగులూరుకు చెందిన చింతా విజయలక్ష్మి, వడ్లమన్నాడుకు చెందిన కొనతం శ్రీరామమూర్తి ప్రమాదవశాత్తు మృతి చెందగా, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున బీమా సాయం మంజూరైంది. సంబంధిత చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని పేర్కొన్నారు. పార్టీ

కోసం పనిచేసే కార్యకర్తలు, వారి కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లక్ష్యమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో అందించిన బీమా సాయం ఆర్థికంగా భరోసానిచ్చిందని బాధిత కుటుంబాల సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, నాయకులు పామర్తి సత్తిబాబు, వల్లభనేని రంగబాబు, పెద్దిబోయిన రాజు, కంచర్ల ప్రకాష్, పెన్నేరు రమేష్, గరికిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

