తాజ్ మసీదులో ఘనంగా గ్యార్మీ వేడుకలు
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు… సర్వమత సామరస్యానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని వెల్లడి… ముస్లిం సోదరులకు గ్యార్మీ శుభాకాంక్షలు…

విజయవాడ, అక్టోబర్ 4: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కుమ్మరిపాలెం సెంటర్ తాజ్ మసీదు ప్రాంగణంలో ముస్లిం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గ్యార్మీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు గ్యార్మీ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమంతోపాటు సర్వమత సామరస్య పరిరక్షణకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం గర్వకారణమన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిచేస్తూ వారికి అండగా ఉంటామని వెలంపల్లి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

