ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గ్రామానికే వైద్యం.. పల్లె ప్రజలకు ఆరోగ్య భరోసా!

రాష్ట్రవ్యాప్తంగా 267 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాల ప్రారంభం… ప్రతి ఐదు వేల జనాభాకు ఆరోగ్య మందిరం.. 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు… గ్రామానికే వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 6:14 PMకి 2,582 వీక్షణలు
గ్రామానికే వైద్యం.. పల్లె ప్రజలకు ఆరోగ్య భరోసా! — చిత్రం 1
గ్రామానికే వైద్యం.. పల్లె ప్రజలకు ఆరోగ్య భరోసా! — చిత్రం 2
గ్రామానికే వైద్యం.. పల్లె ప్రజలకు ఆరోగ్య భరోసా! — చిత్రం 3

1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

నందివాడ, అక్టోబరు 6: వైద్యం కోసం గ్రామీణ ప్రజలు పట్టణాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించి, వారి గ్రామాల్లోనే నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. నందివాడ మండలం జనార్దనపురంలో నూతనంగా నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని మంగళవారం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 24 జిల్లాలు, 87 నియోజకవర్గాల పరిధిలో నిర్మించిన 267 క్లినిక్‌ భవనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభలో మంత్రి మాట్లాడుతూ ఈ భవనాల నిర్మాణానికి సుమారు రూ.105 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచినవి, కొత్తగా చేపట్టినవి కలిపి 4,400కు పైగా క్లినిక్‌ భవనాలను పూర్తి చేసేందుకు వివిధ పథకాల కింద రూ.1,128.02 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి 2,700 కేంద్రాల భవనాలను సిద్ధం చేయడంతోపాటు, రాబోయే ఆరు నెలల్లో మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఐదు వేల జనాభాకు ఆరోగ్య మందిరం ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఒక ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి కేంద్రంలో 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, 71 రకాల వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రక్తపోటు, మధుమేహం, మాతాశిశు ఆరోగ్యం, కంటి, నోటి ఆరోగ్యం, వృద్ధుల ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధుల గుర్తింపునకు సేవలు అందిస్తామని వివరించారు. అవసరమైన రోగులను ఉన్నత వైద్య కేంద్రాలకు పంపడంతోపాటు దూరవైద్యం ద్వారా నిపుణుల సలహాలు అందిస్తామన్నారు. ‘సంజీవని’తో ఆరోగ్య వివరాల నమోదు ప్రతి వ్యక్తికి ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్య కేటాయించి, పరీక్షలు, మందులు, వైద్యుల సూచనలు, చికిత్స వివరాలను డిజిటల్‌గా భద్రపరిచేందుకు ‘సంజీవని’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సత్యకుమార్‌ తెలిపారు. సుమారు 2,500 మంది సమన్వయకర్తల ద్వారా దూరవైద్యం, వైద్యుల సలహాలు, ఆసుపత్రి అపాయింట్‌మెంట్‌ సేవలను అనుసంధానిస్తామన్నారు. జనవరి ఒకటి నుంచి ఈ సేవలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా

గ్రామానికే వైద్యం.. పల్లె ప్రజలకు ఆరోగ్య భరోసా! — అదనపు చిత్రం 2
గ్రామానికే వైద్యం.. పల్లె ప్రజలకు ఆరోగ్య భరోసా! — అదనపు చిత్రం 3

930 మొబైల్‌ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో వాహనంలో 41 రకాల పరీక్షల సదుపాయంతోపాటు సుమారు రూ.పది లక్షల విలువైన ఆటో అనలైజర్‌ పరికరాన్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. గ్రామస్థాయిలో సేవలందిస్తున్న మధ్యస్థాయి ఆరోగ్య అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. గుడివాడలో పది కేంద్రాల ప్రారంభం గుడివాడ నియోజకవర్గంలో 41 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, మూడు బ్లాక్‌ ప్రజారోగ్య యూనిట్లు, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒకేసారి పది విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు. ఎన్టీఆర్‌ పుట్టిన గడ్డపై ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. గత పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని రాము విమర్శించారు. కూటమి ప్రభుత్వం గ్రామస్థాయి నుంచే వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్సతో అనారోగ్య సమస్యలను గుర్తించి నియంత్రించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. వైద్య సేవల్లో లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. అభివృద్ధిపై చర్చకు రావాలి: యార్లగడ్డ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరించాలని సవాల్‌ విసిరారు. ఇరవై ఏళ్లలో రోడ్లు, డ్రైనేజీలు, ఆసుపత్రుల అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. గత ఎన్నికల్లో వెనిగండ్ల రాము సాధించిన మెజారిటీ ప్రజల తీర్పుకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్‌, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ బాలాజీ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు, వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను ఎమ్మెల్యే రాము సత్కరించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086