బెజవాడలో నామినేషన్ల బోణీ.. తొలిరోజు 19 దాఖలు
వైసీపీ నుంచి అత్యధికంగా 12 దాఖలు… టీడీపీ నుంచి నాలుగు, జనసేన నుంచి రెండు… బీజేపీ తరఫున ఒక నామినేషన్…

విజయవాడ, అక్టోబర్ 17: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తొలిరోజు మొత్తం 19 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులు వెల్లడించారు. పార్టీల వారీగా వైసీపీ తరఫున అత్యధికంగా 12 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి నాలుగు, జనసేన నుంచి రెండు, బీజేపీ నుంచి ఒక నామినేషన్ అందినట్లు అధికారులు తెలిపారు.

